బ్యాంకుల్లో డబ్బున్నా… చేతిలో చిల్లిగవ్వలేదు

నోట్ల రద్దు తరువాత ఏటీఎంలు ఇంకా పూర్తిగా తెరుచుకోనేలేదు. అక్కడక్కడా పనిచేస్తున్న ఏటిఎంలు కూడా ప్రస్తుతం మూత పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడుల నేపధ్యంలో ఏటీఎంలకు తాళాలు పడ్డాయి. దీనితో నగదు ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎంలు పూర్తిగా పనిచేసింది ఎక్కడా లేదు. అరకొరగానే పనిచేస్తున్నా వాటితోనే నెట్టుకొస్తున్న ప్రజలకు తాజాగా సైబర్ దాడుల వ్యవహారం మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. నగదు కొరతతో ప్రజలు సతమతమవుతున్నారు. నేరుగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకుందామన్నా బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు కనిపించడం లేదు. చాలా చోట్ల నగదు లేదంటూ బ్యాంకులు బోర్డులు తగిలించారు. అన్ లైన్ బ్యాంకింగ్ పైనే అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో ఆన్ లైన్ లో డబ్బులు పంపేందుకు కూడా జంకుతున్నారు. ఒక్క సారిగా వచ్చిన ఈ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ అవి చేతికి వచ్చే మార్గం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. పెద్ద రద్దయిన తరువాత పరిస్థితి ఇప్పటికీ పూర్తి స్థాయిలో చక్కబడలేదు. అటు బ్యాంకుల్లోనూ నగదు కొరత వేధిస్తోంది. ఏటీఎంలు ఎక్కడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్న దాఖలాలు లేవు. అన్  లైన్ సేవలంటూ ఊదరగొడుతున్నా అన్ని చోట్లా ఇంకా  ఆన్ లైన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు.  దీనికి తోడు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా తాజాగా సైబర్ దాడుల నేపధ్యంలో ఉన్న అరకొర ఏటీఎంలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవడానికి కూడా ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో నగదు కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *