ప్రమాదంలో వరుడితో సహా 4గురు మృతి

ఆనందంగా పెళ్లికి బయలు దేరిన వారి జీవితాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మోతే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొద్ది గంటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన పెళ్లికొడుకుతో పాటుగా మరో ముగ్గురు మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలు నిషాదంలో మునిపోయాయి. ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన పెళ్లి బృందం ఖమ్మం జిల్లా చర్ల మండాలానికి వెళ్తోంది. పెళ్లి కుమారుడితో పాటుగా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఉన్న ఉన్న వారి వ్యాను సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఆగి ఉంది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు వాహనాన్ని అక్కడ నిలిపి ఉంచారు. ఆగి ఉన్న వాహనాన్ని గుర్తించని లారీ ఒకటి వ్యాను వెనకనుండి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

లారీ ఢీకొట్టడంతో వ్యానులో ఉన్న పెళ్లి కుమారుడు శేషసాయినాథ్ (21), తో పాటుగా దామోదర్ రావు (35) లు ఘటనా స్థలంలోనే చనిపోయారు.సత్యనారాయణ (70), అఖిల్ (2)లు ఆస్పత్రిలో కన్నుమూశాలు. గాయపడ్డ వారిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *