భారీ ఎన్ కౌంటర్ 20 మంది మావోలు మృతి

 

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో సుమారు 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గడ్ లోని భీజాపూర్ జిల్లా రాయగడలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అయితే ఎన్ కౌంటర్ ఏ ప్రాంతంలో జరిగింది ఖచ్చితంగా తెలయరావడం లేదు. రాష్ట్ర పోలీసులతో పాటుగా సీఆర్పీఎఫ్ దళాలు కూడా ఎన్ కౌంటర్ లో పాల్గొన్నాయి. స్థానిడ అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారపడగా ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 20 మంది వరకు మావోయి  చనిపోయినట్టు సమాచారం. ఈ ఆపరేషన్ లో  350 మందికి పైగా సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కు తారసపడ్డ మావోయిస్టులు కోబ్రా దళాలకు చెందిన తరహా యూనిఫాం ను వేసుకుని ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఎన్ కౌంటర్ తో మావోలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గడ్ లో ఇటీవల సీఆర్పీఎఫ్ బలగాలపై మెరుపుదాడి చేసిన మావోలు 25 మంది ని పొట్టున పెట్టుకున్న తరువాత ప్రతీకారం కోసం ఎదురు  చూస్తున్న బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మావోల కార్యకలాపాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాన్ని కూడా సిద్ధం చేసిన తరువాత కేంద్ర బలగాలు గాలింపు కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో జరిగిన భారీ ఎన్  కౌంటర్ లో 20 మంది మావోలను కేంద్ర బలగాలు హతమార్చాయి. మరో వైపు తాల్చేరు ప్రాజెక్టు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొంత మందిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి   రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని మావోయిస్టులకు సహాయపడుతున్న వ్యక్తులుగా అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Eagles jersey cheap wholesale jerseys