నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్-కాంగ్రెస్ రాళ్లదాడి

 

నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. గంధంవారి గూడెంలో బత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంఖుస్తాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇరు పార్టీల కార్యక్రతలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. రాళ్లదాడిలో పలువురికి గాయాలు కాగా వాహనాలు ద్వసం అయ్యాయి. స్థానిక బత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు రావాల్సి ఉంది. ఈ లోపుగా భారీ కాన్వాయ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనితో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపులో కొంత మంది రాళ్లు విసరడంలో రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నాయి. దీనితో రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్ణణతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను దూరంగా పంపించడంతో వాతావరణం చల్లబడింది. టీఆర్ఎస్ కార్యకర్తలు తమ వారిపై దాడిచేశారని కోమటిరెడ్డి ఆరోపిస్తూ స్థానిక రహదారిపై బైఠాయించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కవ్వింపు చర్యల వల్లే ఘర్షణ జరిగిందని కోమటిరెడ్డి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Philadelphia Eagles jersey cheap cheap Eagles jerseys