ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసిన పిచ్చివాడు

విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఎత్తివేయడం సంచలనం రేపింది. బ్రారేజి కి చెందిన 58,59 గేట్లకు సంబంధించిన స్విచ్ ను ఆన్ చేసిన సదరు వ్యక్తి గేట్లను ఎత్తివేయడంతో ఒక్కసారిగా నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లింది. బ్యారేజీ నుండి నీరు దిగువ ప్రాంతాలకు రావడంతో అప్రమత్తమైన జనవనరుల శాఖ అధికారలు అప్రమత్తమై పరిశీలించగ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసినట్టు గుర్తించి వెంటనే సంబంధిత స్విచ్ అను ఆఫ్ చేసి గేట్లను దించేశారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోయింది. గేట్లను ఎత్తివేసింది గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బంగారు బాబు గా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మతి స్థిమితం లేనట్టు తేలింది. బ్యారేజీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మతిస్థిమిత లేని వ్యక్తి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తివేసిన ఘటన బ్యారేజీ వద్ద భద్రతా లేమి స్పష్టంగా కనిపించింది. ఒక వ్యక్తి ఏకంగా గేట్లను ఎత్తివేసే స్విచ్ ను ఆన్ చేసి వెళ్లినా సంబంధిత అధికారులు ఎప్పటికో గానీ గుర్తించలేదంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ వద్ద భద్రత ఎంత బాగా నిర్వహిస్తున్నరన్న సంగతి ఈ ఘటనతో బయటపడింది. మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన పనే అయినా గేట్లు ఎత్తివేస్తే దిగువ ప్రాంతాలు ఒక్కసారిగా నీటి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. బ్యారేజీలో ఎక్కువ స్థాయిలో నీళ్లు లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *