అయ్య బాబోయ్ ఎండలు…

ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సాధారణం కన్నా 5 నుండి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. సాధారణం కన్నా ఐదు డిగ్రీల ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డు కావడం అసాధారణం. రెండు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉత్తరాది నుండి వీస్తున్న వడగాల్పులకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ముపరితల ఆవర్తన ద్రోణి వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సరాసరి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల దాని ప్రభావంతో రాత్రి  పూట ఉష్యోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

 

హైదరాబాద్ లో 43 , విజయవాడ- 46, గుంటూరు-46, నిజమాబాద్-44, మహబూబ్ నగర్ -43, భద్రాచలం-44, ఖమ్మం-45, ఒంగోలు-45, నెల్లూరు-45, ఏలూరు-45, బాపట్ల-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో రెండు నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *