అమెరికాలో మనోళ్లు బాగా సంపాదిస్తున్నారు

అమెరికాలో భారతీయులు అన్ని రంగాల్లో ముందున్నారని అక్కడ మనవాళ్లు బాగా సంపాదిస్తున్నారని మరీ ముఖ్యంగా తెలుగు  వాళ్ల సంపాదన ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కష్టపడి పనిచేసే తత్వం మన వారికి ఎక్కువని సంపాదించిన దాన్ని పొదుపుగా వాడుకోవడం లో కూడా మన వాళ్లు ఇతరులకంటే ముందుటారని చంద్రబాబు చెప్పారు. వీటి వల్లే మన వాళ్లు అమెరికాలో బాగా సంపాదించుకుంటూ ఉన్నతంగా స్థిరపడుతున్నారని అన్నారు.  తన అమెరికా పర్యటనలో వ్యవసాయంపై ఎక్కువగా దృష్టిసారించినట్టు చెప్పారు. వ్యవసాయ అభివృద్ది కోసం చేపట్టాల్సిన చర్యలను గురించి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు చంద్రబాబు వెళ్లడించారు.  కర్నూలులో సోలార్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. సోలార్ విద్యుత్ తో వ్యవసాయ పంపులు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీని వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ ఆదా అవడమే కాకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అభివృద్ది సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో సౌర విద్యుత్, పవన విద్యుత్ కు మంచి అవకాశాలున్నట్టు చెప్పారు.

ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు చంద్రబాబు చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుందని అన్నారు. తన అమెరికా పర్యటన విజయవంతం అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *