కేరళలో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య

కేరళాలో హత్యల పరంపర సాగుతూనే ఉంది. తాజాగా మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కేరళలోని కన్నూరు జిల్లా  కక్కంపార పాక్కోట్ బ్రిడ్జి వద్ద బిజు అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అత్యంత దారుణంగా హత్యచేశారు. కత్తులతో వేటాడి ఆయన్ను నరికి చంపారు. జులై 11న జరిగిన ధన్ రాజ్ అనే సీపీఎం కార్యకర్త  హత్య కేసులో బిజు నిందితుడిగా ఉన్నాడు. ఈ పాతకక్షల నేపధ్యంలోనే బిజు హత్య జరిగిఉంటుందని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యతో పయ్యన్నూర్ ప్రాంతంలో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  కేరళలో సీపీఎం, బీజేపీ ల మధ్య తీవ్ర స్థాయిలో వైరం సాగుతోంది. దాడులు ప్రతిదాడులతో పలు ప్రాంతాలు అట్టుగుతున్నాయి.

సీపీఎం కేరళాలో హత్యా రాజకీయాలు నడుపుతోందని బీజేపీ అరోపిస్తుండగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు బీజేపీ,ఆర్ఎస్ఎస్  లు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను దారుణంగా నరికి చంపుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ అంటోంది. వరుసగా జరుగుతున్న హత్యలను ప్రభుత్వమే చయిస్తోందనేది బీజేపీ ఆరోపణ.  ప్రభుత్వం సీపీఎం కార్యకర్తలను చూసీ చూడనట్టుగా వ్యవహరించడం వల్లే వారు రెచ్చిపోతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nfl Eagles jersey Philadelphia Eagles jersey cheap