కుక్కలతో కరిపించి, కాల్చి… భార్యపై ఆప్ నేత దారుణం

ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సోమనాథ్ భారతి తన భార్యను దారుణంగా హింసించేవారని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఈ మేరకు వారు ఢిల్లీ హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేశారు. సోమనాథ్ భారతి తన భార్యను నిత్యం వేధింపులకు గురిచేయడంతో పాటుగా కొట్టేవారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అంతటితో ఆగకుండా కుక్కలతో కరిపించడం, కాల్చడం లాంటి చర్యలకు కూడా దిగారని పోలీసులు చెప్తున్నారు. సోమనాథ్ భార్య లిపిక ఒంటిపై కాల్చిన గుర్తులు, కుక్క గాట్లు ఉన్నాయంటూ ఎయిమ్స్ ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. సోమ్ నాథ్ భార్య లిపికి ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ  పోలీసులు తమ నివేదికను కోర్టుకు సమర్పించారు. తన భర్త తనను దారుణంగా హింసిస్తున్నారంటూ తన భర్త , ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సోమనాథ్ భారతిపిపై ఆమె భార్య లిపిక పోలీసులకు  2015లో ఫిర్యాదు చేశార. దీన్ని విచారించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇది ఢిల్లీలో తీవ్ర సంచలనం రేపింది. ఆటు తర్వాత కింది కోర్టులు సోమనాథ్ కు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాలు చేస్తూ లిపిక హైకోర్టును ఆశ్రయించారు.

తనను అత్యంత దారుణంగా హింసలకు గురిచేసిన తన భర్త బెయిల్ ను రద్దు చేయాలని లిపిక కోర్టును కోరుతోంది. తనను దారణంగా హింసకు గరిచేశాడని కాల్చేవాడని లిపిక పేర్కొంది. తన పెంపుడు కుక్కలతో కరిపిస్తూ పాశవిక ఆనందం పొందేవాడని లిపిక ఆరోపిస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆప్ నేత సోమనాథ్ భారతి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయనపై వచ్చిన ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Philadelphia Eagles jerseys jersey for cheap