తల్లిప్రేమకు సజీవ సాక్షం…

బిడ్డకి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా కన్న తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అది మనుషులైనా జంతువులైనా ఒకటే. బిడ్డలకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏ మాత్తం తల్లి తట్టుకోలేదు. ఇటువంటి కన్నతల్లి ప్రేమకు నిదర్శనంగా కనిపించే చిత్రం ఇది. జబల్ పూర్ కి చెందిన అవినాశ్ లోథి అనే ఫొటోగ్రాఫర్ బిడ్డకోసం తల్లి కోతి పడుతున్న వేదనను తన కెమేరాలో బందించాడు. కోతులు అడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిన్న కోతి పిల్ల అపస్మారక స్థితిలో పడిపోయింది. దీనితో వెంటనే పిల్లను చేతిలోకి తీసుకుని తల్లి బిడ్డకు ఏమైందో అనే బాధతో ఏడుస్తున్న దృశ్యం ప్రతీ ఒక్కరినీ కలచి వేస్తోంది. అపస్మారస్థితికి చేరుకున్న కోతి పిల్ల కొద్దిసేపటికి తేరుకుని తిరిగి మామూలు స్థితికి రావడంతో తల్లికోతి ఆనందంగా దాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను లోధీ తన కెమేరాలో బంధించారు. తన బిడ్డకు ఏమైందోననే తల్లికోతి ఆరాటం ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *