టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ సోదాలు

తెలుగుదేశం ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ నుండి నెల్లూరు వచ్చిన 12 మంది అధికారులు ఉదయం నుండి వాకాటి నారాయణ రెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. వాకాటి ఇంట్లో పలు రికార్డులను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ అధికారులు ఎవరినీ ఇంట్లోకి నారయకుండా తమ పనిని చక్కబెడుతున్నారు. ఇంటి నుండి కూడా ఎవరినీ బయటకు వెళ్లనీయడం లేదు. ఫైనాస్ వ్యవహారాల్లో ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చినట్టుగా వచ్చిన ఆరోపణలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పలు పత్రాలకు సంబంధించిన వివరాలను వాకాటి నుండి సీబీఐ అధికారులు అడిగితెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొద్దిసేపు అక్కడ స్వల్ప ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. సీబీఐ సోదాలకు సంబంధించిన ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్ ను వాకాటి అనుచరులు అడ్డుకున్నారు.  ఫోటోగ్రాఫర్ నుండి కెమేరాను లాక్కునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత వెలకొంది. దీనితో ఇంట్లో నుండి బయటికి వచ్చిన వాకాటి తన ఇంట్లో ఎటువంటి సోదాలు జరగడం లేదని చెప్పారు. తన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయనేది అవాస్తవమని ఒక పక్క వాకాటి చెప్తుండగానే సోదాలు నిర్వహిస్తున్న అధికారి ఒకరు వచ్చిన ఆయన్ను లోపలికి తీసుకుని వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *