నిషీత్ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన కారు ప్రమాదంలో కన్నుమూసిన నారాయణ విద్యాసంస్థల అదినేత, ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరులోని బోడిగాడి తోట శ్మశానవాటికలో అంత్యక్రియను నిర్వహించారు. మంత్రి నారాయణ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణ కాళాశాల నుండి బోడిగాడి తోట శ్మశాన వాటిక వరకు నిషీత్ అంతిమ యాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నిషిత్ బంధువులు, స్నేహితులు, నారాయణ కళాశాలల విద్యార్థులు అంతిమ యాత్రకు తరలివచ్చారు. పలువురు మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.  హైదరాబాద్ లో మృతి చెందిన నిషిత్ మృతదేహాన్ని రోడ్డు మార్గంలో నెల్లూరు తరలించారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే లండన్ నుండి చెన్నైకి విమానంలో చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో నెల్లూరుకు వచ్చారు. నారాయణ ఈ ఉదయం 4.00 కు నెల్లూరు చేరుకున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసిన నారాయణ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. సహచర మంత్రులు, బంధువులు నారాయణను ఓదార్చారు. మంత్రి లోకేష్ నారాయణ నివాసం వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *