అతివేగమే నారాయణ కొడుకు ప్రాణం తీసింది

    dc-Cover-024vht67tjnhp3u9bk87b5cqj5-20170510093050.Medi nithish-gal1h nithish-gals

ఏపీ మంత్రి నారాయణ కుమారుడి కారు ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు అత్యంత వేగంగా దూసుకుని పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కారు అత్యంత వేగంగా నడపడంతో కారుపై నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచానాకు వచ్చారు. కారు చాలా వేగంగా ఉండడంతో పాటుగా చిన్న పాటి మలుపు ఉండడంతో వేగంగా వచ్చిన  కారు మెట్రో పిల్లర్ కు గుద్దుకుంది. అతి వేగం కారణంగా కారులోని బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వచ్చిన స్థానికులు కొందరు కారులోనుండి నారాయణ కుమారుడు నిషీత్ అతని స్నేహితుడు రవిచంద్ర లను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వారిద్దరు కారులో ఇరుక్కుని పోయారని వారని బయటకు తీసేందుకు చాలా సేపు పట్టిందని వారు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే నిషీత్ స్నేహితుడు మరణించగా నిషీత్ కొద్ది సేపటికే చనిపోయాడని వారు చెప్పారు. బెలూన్లు విచ్చుకున్నప్పటికీ అవి వీరికంటే ఎత్తులో ఉండడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ప్రమాదం నుండి బయటపడడానికి అవకాశం  ఉండేదని అంటున్నారు.

తెల్లవారు జామున రోడ్డుపై పెద్దగా వాహనాలు లేవని వీళ్లకు ముందు ఒక వాహనం ఉందని దాన్ని ఓవర్ టేక్ చేసి అదే వేగంతో ముందుకు దూసుకుని పోయే క్రమంలో కారుపై అదుపు కోల్పోయి ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. పోలీసుల సీసీ టీవీ విజువల్స్ లో కూడా కారు అత్యంత వేగంతో దూసుకుని పోయిన తీరు కనిపిస్తోంది. అత్యంత వేగంగా వచ్చిన  కారు అదుపు తప్పి పిల్లర్ ఢీకొట్టింది. వీరు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడుకున్నదైనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ బెంజ్ కారులో భద్రతా ప్రమాణాలు అత్యన్నత స్థాయిలో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *