ఈవీఎం ట్యాంపరింగ్ పై ‘ఆప్’ ప్రదర్శన

    ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల ద్వారా అక్రమాలకు పాల్పడవచ్చని, ఈవీఎంల ద్వారానే బీజేపీ యూపీలో, ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక్లలో  అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఎట్లా చేయవచ్చో ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా వివరించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే సౌరవ్ భరద్వాజ్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై సభ్యులకు పరద్శన ఇచ్చారు.  సభకు ఈవీఎం మిషన్‌తో పాటు కంట్రోల్ యూనిట్‌ను ఆయన తీసుకువచ్చారు. తొలుత అన్ని పార్టీలకు ఒక్కో ఓటు వేసి మిషన్లు సరిగా పనిచేస్తున్నాయో, లేదో, సభ్యులకు సరి చూపారు. పనితీరు సరిగ్గా ఉందని సభ్యులందరితో కలిసి నిర్ధారించుకున్న తరువాత వాటి ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో ఆయన సభ్యులకు వివరించారు. ట్యాంపరింగ్ చేయాలనుకున్న పార్టీలు కానీ, వ్యక్తులు కానీ ఓక సీక్రెట్ కోడ్‌ను వినియోగిస్తారని ఆయన తెలిపారు. కోడ్ నంబర్లు పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా మారుతాయని చెప్రారు.  అనంతరం పోలింగ్ జరిగే విధానంలో కోడ్ నెంబర్ ఎలా జొప్పిస్తారనే విషయాన్ని భరద్వాజ చూపించారు. ఈ తరుణంలో ఏ పార్టీ అయితే విజయం సాధించాలని నిర్దేశిస్తారో అదే పార్టీ గెలుస్తుందని రుజువు చేసి చూపించారు.ఈవీఎం ట్యాంపరింగ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందని సౌరవ్ పేర్కాన్నారు. విదేశీ టెక్నాలజీని ఉపయోగించి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అపహాస్యం  చేస్తున్నారని మండిపడ్డారు.  దేశ వ్యాప్తంగా బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రానున్న గుజరత్ ఎన్నికల్లో   మూడు గంటలపాటు ఈవీఎంలను తమకు అప్పగిస్తే బీజేపీకి ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని సౌరవ్ భరద్వాజ్ సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *