వాట్సప్ చిచ్చు-ఇరు వర్గాల ఘర్షణ ఉధ్రిక్తత

ఒక యువకుడు వాట్సప్ లో పెట్టిన మెసేజ్ కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. ఒక వర్గాన్ని కించపర్చేవిగా ఉన్న వ్యాఖ్యలతో ఒక యువకుడు 8 నిమిషాల ఆడియోను పోస్ట్ చేశాడు. ఇది స్థానికంగా వైరల్ కావడంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు రోడ్డు పైకి వచ్చి తమను కించపరుస్తూ వాట్సప్ మెసేజ్ పెట్టిన యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. దీనికి ప్రతిగా మరో వర్గం కూడా రోడ్డు పైకి రావడంతో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపుతప్పకుండా చర్యలు తీసుకున్నారు.

భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారుల్లో కొంత మంది పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. ఒక్కసారిగా ఉధ్రిక్తతలు తలెత్తడంతో తొలుత పోలీసులు పరిస్థితి కొంత అదుపు తప్పినా పోలీసులు వెంటనే ఆందోళనను కట్టడి చేయగలిగారు. అల్లరి మూకల దాడిలో జిల్లా ఎస్పీ, డీఎస్పీతో సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పట్టణంలో 144 సెక్షన్ విధించిన పోలీసు అధికారులు అదనపు బలగాలను రప్పించారు.

వాట్సప్ లో ఆకతాయి చేస్టల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి బాద్యులైన వారికిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులపై రాళ్లు రువ్విన వారిని కూడా విడిచిపెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *