ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనున్న భారత్

ఇంగ్లాండ్ లో జూన్ 1వ తేదీ నుండి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడనుంది. ఐసీసీతో విభేదాల నేపధ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను బీసీసీఐ కొట్టివేసింది. ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందని బీసీసీఐ ప్రకటించింది. దీనితో ఛాంపియన్స్ ట్రోఫీపై నెలకొన్న సందిగ్థత వీడిపోయింది. ఐసీసీతో తలెత్తిన వివాదాలను కూడా సామరస్యంగా పరిష్కరంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీనితో కోసం ఐసీసీతో మంతనాలు జరిపే బాధ్యతను బోర్డు జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరికి అప్పగించింది. ఆదివారం సమైవేశమైన బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ టోర్నీలో ఆడే జట్టును ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *