గుడికి వెళ్తే తప్పేంటి-గవర్నర్ సూటి ప్రశ్న

దేవాలయానికి వెళ్తే తప్పేంటని తెలంగాణ, ఏపీల గవర్నర్ ఇ.నరసింహన్ ప్రశ్నించారు. నిత్యం దేవాలయాల వెంట తిరిగే నరసింహన్ ను రాష్ట్ర గవర్నర్ గా కొనసాగించవద్దంటూ కాంగ్రెస్ నేత వీహెచ్ చేసిన విమర్శలపై నరసింహన్ స్పందించారు. దేవాలయాలకు వెళ్తే తప్పేంటని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. దేశంలో దేవాలయాలకు వెళ్లకూడదనే ఆంక్షలు ఎక్కడా లేవుకదా అని అని అన్నారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరసింహన్ దీనిపై మాట్లాడారు. ఉదయం పూట దేవాలయానికి వెళ్లడం తనకు అలవాటని అది ఇప్పుడు చేసుకున్న అలవాటు కాదని తాను గత కొన్ని సంవత్సరాలుగా ఉదయం పూట దేవాలయానికి వెళ్లిన తరువాతే కార్యాలయానికి వేళ్తానని చెప్పారు. ప్రతీ రోజు దేవాలయానికి వెళ్లడంతో పాటుగా ఇతర దేవాలయాలకు వెళ్లడం కూడా తనకు అలవాటేనని గతంలో తాను చాలా దేవాలయాను సందర్శించానని ఇక ముందు కూడా వెళ్తానని చెప్పారు. దేవాలయాలకు వెళ్లడాన్ని తప్పుబట్టలేమన్నారు.

తాను దేవాలయాలకు వెళ్తున్నంత మాత్రానా తాను కార్యాలయంలో అందుబాటులో లేని పక్షంలో తనపై విమర్శలు చేయవచ్చని తాను నిత్యం కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్న సంగతిని గమనించాలని నరసింహన్ పేర్కొన్నారు. తాను రెండు రాష్ట్రాలను సమ దృష్టితోనే చూస్తానని అన్నారు. తన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏకారణం చేత పెంచిందో తనకు తెలియదన్నారు. తాను పదవీ  విరమణ చేసిన తరువాత చెన్నైలో స్థిరపడతానని, సాధారణ  జీవితం గడుపుతానని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం తాను పనిచేస్తున్నానని నరసింహన్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cheap Eagles jerseys jersey for cheap