యువతి కిడ్నాప్ డ్రామా-పోలీసుల హైరానా

నోయిడాకు చెందిన 20 సంవత్సరాల యువతి అడిన కిడ్నాప్ డ్రామా పోలీసులను, తల్లిదండ్రులను పరుగులు పెట్టించింది. డబ్బుల కోసం తన స్నేహితులతో కలిసి ముస్కాన్ అగర్వాల్ అనే యువతి కిడ్నాప్ డ్రామాకు తెరతీసింది. కాన్పూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్న యువతి తాను కిడ్నాప్ గు గురైనట్టు డ్రామా ఆడింది. 10లక్షలు ఇవ్వకుంటే మీ కూతురిని చంపేస్తామంటూ స్నేహితులతో తన తండ్రికి ఫోన్ చేయించింది. తానను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఫోన్ లో తండ్రితో మాట్లాడిన ముస్కాన్ తనను విడిచి పెట్టాలంటూ 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. డబ్బు కూడా ముస్కాన్ ఖాతాకే పంపాలంటూ ఆమె స్నేహితులు బెదిరించడంతో వెంటనే పది లక్షల రూపాయలను ముస్కాన్ తండ్రి ఆమె ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశారు.

విషయాన్ని పోలీసులకు చెప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ నాటకాన్ని బయటపెట్టారు. ముస్కాన్ ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తనకు తాను కిడ్నాప్ అయినట్టు నాటకం ఆడుతోందని గుర్తించారు. తన ముగ్గరు స్నేహితులతో కలిసి ఆమె ఈ నాటకం ఆడింది. ముస్కాన్ తన స్నేహితురాలికి 4 లక్షల రూపాయలను ఇచ్చింది. వాటిని తీరిగి తీసుకోవాలంటూ తండ్రి ఒత్తిడి చేయడంతో తాను కిడ్నాప్ అయినట్టుగా నాటకం ఆడి ఆ డబ్బును తిరిగి తండ్రికి ఇవ్వాలని చేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ముస్కాన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పార్క్ లో ఉండగా పోలీసులు వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ డ్రామా ఆడిన ముస్కాన్ తో పాటుగా ఆమె స్నేహితులపైనా కేసు నమోదు చేశారు.

తాను ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తనను బలవంతంగా ఎత్తుకెళ్లినట్టు ముస్కాన్ చెప్పడంతో మొదట పోలీసులు హైరానా పట్టారు. ఏకంగా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి యువతిని కిడ్నాప్ చేశారనే వార్త దావానలంగా వ్యాపించడంతో నోయిడా, ఢిల్లీ ప్రాంతాల్లో కలకలం రేపింది. తీరా కిడ్నాప్ డ్రామా అని తేలడంతో అటు స్థానికులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cheap jerseys china Philadelphia Eagles jersey cheap