రు.10 నాణాలు చెల్లుతాయి

పది రూపాయల నాణాలు చెల్లవంటూ వస్తున్న వదంతులు బ్యాంకులకు తలనొప్పిగా మారాయి. చాలా ప్రాంతాల్లో దుకాణుదారులు పదిరూపాయల నాణాలను తీసుకోవడం లేదు. దీనితో చాలా మంది తమ వద్ద ఉన్న పదిరూపాయల నాణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. పది రూపాయల నాణాలు చెల్లుతాయని బ్యాంకు అధికారులు ఎంతగా చెప్తున్నా పెద్ద మొత్తంలో నాణాలను డిపాజిట్ చేసి వెళ్లిపోతున్నారు. దీనితో నాణాలను భద్రపర్చడం బ్యాంకులకు తలకుమించిన భారంగా మారిపోతోంది. కొన్ని బ్యాంకుల్లో నాణాలను తీసుకోవడం లేదు. దీనితో వినియోగదారులు బ్యాంకు సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు.

పది రూపాయల నాణాలపై వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమేనని నాణాలు చెల్లుతాయని బ్యాంకులు ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వాటిపై అపోహలను వదిలిపెట్టడం  లేదు. తమ వద్ద ఉన్న నాణాలను వదిలించుకునే పనిలో పడిపోయారు. దీనికి తోడు దుకాణుదారులు నాణాలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.  మరో వైపు అటు తాము పది రూపాయల నాణాలు ఇస్తుంటే వినియోగదారులు తీసుకోవడం లేదని దుకాణుదారులు వాపోతున్నారు. పదిరూపాయల నాణాలను నిషేధిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో ఒక్కసారిగా నాణాల వినియోగం ఆగిపోయింది. పదిరూపాయల నాణాలు చెల్లుతాయని వాటిపై అపోహలు వద్దంటూ బ్యాంకులు వినియోగదారులకు సందేశాలు పంపుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *