టీఆర్ఎస్ పై బీజేపీ తీవ్ర ఆరోపణలు

టీఆర్ఎస్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్లీనరీ కోసం వ్యాపారల వద్ద పెద్ద మొత్తంలో విరాళాలు తీసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు వారికోసం రైతులను నట్టేట ముంచుతోందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన విమర్శించారు. తమది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చడంలో పూర్తిగా విఫలం అయిందని వారి సమస్యలను గాలికి వదిలేసిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. గిట్టుబాటు ధరల  కోసం కడుపు మండిన రైతులు ఖమ్మంలో మార్కెట్ పై దాడిచేశారని వారిపై కేసులు పెడుతూ  రైతులను జైలు పాలు చేయాలనుకోవడం దారుణమన్నారు. మిర్చీకి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను 5వేలుగా నిర్ణయించిందని ఆయన చెప్పారు. వెంటనే మిర్చీ రైతులకు బోనస్ ప్రకటించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారికి కనీస మద్దతు ధరను కల్పించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

అధికార దర్పంతో టీఆర్ఎస్ నేతలు అకృత్యాలకు పాల్పుడుతన్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత అక్బర్ ఖాన్ అడవి జంతువులను వేటాడడంతో పాటుగా దళితుల, గిరిజన భూములను ఆక్రమించుకుంటున్నాడని కిషన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న వారిపై పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వన్యప్రాణులను వేటాడినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cheap Philadelphia Eagles jersey cheap jerseys china