సుకుమా ఘటనపై స్పందించిన మావోలు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలపై దాడి జరిపి 25 మందిని పొట్టనుపెట్టుకున్న ఘటనపై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు నేత వికల్ప్ పేరుతో ఒక ఆడియో టేప్ ను మావోలు విడుదల చేశారు. అటవీ ప్రాంతంలో కేంద్ర బాలగాలు సాగిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగానే దాడిచేసిన జవాన్లను హతమార్చినట్టు వికల్ప్ ఆ ఆడియోలో పేర్కొన్నాడు. స్థానిక ప్రజలను, గిరిజనులను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని వారిని హింస పెడుతున్నారంటూ వికల్ప్ తన సందేశనంలో పేర్కొన్నాడు. అటవీ సంపదను కార్పేరేట్ శక్తులకు ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయంటూ వికల్ప్ తన ఆడియో సందేశంలో ఆరోపించాడు.

తమది ప్రజా పోరాటమని ప్రజల కోసం తాము పోరాడుతూనే ఉంటామంటూ ప్రకటించాడు. కేంద్ర బలగాను ఆదివాసీ ప్రాంతం నుండి వెంటనే పంపించాలని డిమాండ్ చేశాడు. కేంద్ర బలగాల అరాచకాలకు అంతుపొంతూ లేకుండా పోతోందననేది వికల్ప్ ఆరోపణ. ప్రాణాలతో పట్టుబడ్డ నక్సలైట్ల పట్ల కేంద్ర బలగాలు అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. మహిళా నక్సలైట్లు పట్టుపడితే వారి పట్ల కేంద్ర బలగాలు వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉందని, వారిని అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారని వికల్ప్ ఆరోపించాడు. కేంద్ర బలగాల అరాచకాలు ఆగనంత కాలం తమ పోరాటం కూడా సాగుతుందని వారిపై దాడులు చేస్తూనే ఉంటామన్నాడు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ యుద్ధం సాగుతుందని మావోయిస్టు ప్రతినిది వికల్ప్ స్పష్టం చేశాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తమ పోరాటం సాగుతుందని ప్రజా యుద్ధంలో చివరికి తమదే విజయమని అన్నాడు. ఆదివాసీ ప్రాంతాల నుండి వెనక్కి వెళ్లక పోతే కేంద్ర బలగాలు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *