కాంట్రక్టు ఉద్యోగాలపై  మళ్లీ కోర్టుకు

తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పేషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణను సవాలు చేస్తూ కొంత మంది కోర్టును ఆశ్రయించగా కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణకు కోర్టు బ్రేకులు వేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల క్రమబద్దీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి స్వయంగా పలుసార్లు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామంటూ హామీ ఇచ్చిన నేపధ్యంలో కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఆశనిపాతంగా మారింది. దీనితో మరోసారి హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముక్యమంత్రి కేసీఆర్ తో చర్చించిన తరువాతే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 600 మందికి పైగా ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత తీర్పు నేపధ్యంలో వారి పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంలో పడింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 7 వేల మందికి పైగా ఉద్యోగాలను క్రమబద్దీకరించే క్రమంలో ఆర్థిక శాఖకు వినతులు రాగా 1500  మంది ఉద్యోగాల క్రమబద్దీకరణకు ఆర్థిక శాఖ ఓకే చేసింది.  కోర్టు తీర్పు నేపధ్యంలో ప్రస్తుతం వాటి పరిస్థితి డోలాయమానంలో పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *