ఓయూలో సీఎం ఎందుకు మాట్లాడలేదు…?

ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించకుండానే వెనుతిరిగారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన సీఎం ఇప్పుడు కూడా ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం పై పలువురు విద్యార్థులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఓయూలో ఎందుకు ప్రసంగించకుండా వెళ్లిపోయారనే దానిపై ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. ముఖ్యమంత్రి ప్రసంగానికి కొంత మంది అడ్డుతగులుతారనే ఆలోచనతోనే సీఎం మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది.

ఉద్యోగ ప్రటనలు, ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రభుత్వ విధానాల పట్ల ఉస్మానియాలోని ఒక వర్గం ఆగ్రహంతో ఉంది. యూనివర్సిటిలోకి కేసీఆర్ ను అడుగుపెట్టనీయమంటూ వారు హెచ్చరికలు కూడా చేశారు కూడా . ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ప్రసంగించకుండా వెళ్లిపోయారని కొందరు అంటుండగా సమయాభావం వల్ల రాష్ట్రపతి పర్యటనలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే సీఎం ప్రసంగించలేదని మరికొందరు చెప్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి ప్రసంగించకుండానే వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *