బాహుబలి-2కు తెలంగాణలో ప్రత్యేక అనుమతి

తెలంగాణ వ్యాప్తంగా బాహుబలి-2 చిత్రాన్ని రోజులు ఐదు షోలు ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనే నిబంధనను ఈ చిత్రానికి సడలించి ఐదు షోలు వేసుకునే వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే జీవోను విడుదల చేయనున్నట్టుతెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఐదు షోలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాహుబలి చిత్ర నిర్మాణ ప్రసాద్ దేవినేని సచివాలయంలో మంత్ర తలసానిని కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తలసాది ఐదు షోలకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి-2 చిత్రానికి తేలంగాణ ప్రభుత్వం తన వంతుగా సహాయం  చేస్తుందని తలసాని ఈ సందర్భంగా చెప్పారు. తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఉవ్వీళుతున్నారని భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూసిన సందర్భాలు లేవని మంత్రి అన్నారు. బాహుబలి -2 విడుదల సందర్భంగా మంత్రి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపార. మొత్తం ఆరు వేల ధియేటర్లలో ఈ చిత్రం విడుదల అవుతున్నట్టు నిర్మాత వెల్లడించారు. ఐదు షోలకు అనుమతించిన మంత్రకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cheap Philadelphia Eagles jersey jersey for cheap