ఓకే దేశం …ఓకే సారి ఎన్నికలు

దేశం మొత్తం ఏకేసారి ఎన్నికల నిర్వహణపై అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెరపైకి తెచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న కీలక నీతిఆయోగ్ సమావేశంలో ప్రధాని తన ప్రసగంలో దేశం అంతా ఓకేసారి ఎన్నికలు జరగాలన్న అంశాన్ని ప్రస్తావించారు.  ‘ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు’ అంటూ ప్రధాని కొత్త నినాదాన్ని ఇచ్చారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు నిర్వహిచడం వల్ల దేశంలో నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండే విధానానికి స్వస్తి పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఓకే సారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నిర్వహణ సులభతరం కావడంతో పాటుగా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందనే అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశరు.

దేశం మొత్తం ఏకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను గతంలోనే ప్రధాని తీసుకుని వచ్చారు. దీనిపై కొంత మంది సుముఖత వ్యక్తం చేయగా మరికొందరు వ్యతిరేకించారు. ఎన్నికలు నిర్వహణా వ్యయాన్ని భారీగా తగ్గించడంతో పాటుగా ఎన్నికల కోడ్ పేరుతో  అభివృద్ది కార్యక్రమాలకు ఆటకం కలక్కుండా ఉండేందుకు ఈ తరహా ఎన్నికల నిర్వహణ ఉత్తమమనే అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. అయితే ఈ విధానాన్ని అమలు చేయాలంటే చాలా రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పాడుతుంది. దీనితో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో పదవీ కాలం ముగిసిన తరువాత  కూడా కొన్ని ప్రభుత్వాలు అధికారంలో కొనసాగాల్సి ఉంటుంది. రాజ్యాంగ రిత్యా ఈ రెండూ కష్టమే. ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలను తీసుకుంటే 2017లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి తిరిగి 2022లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశం అంతటా ఏకేసారి ఎన్నికలు నిర్వహించాలని చూస్తే యూపీలో 2019లో లోక్ సభ ఎన్నికలతో పాటుగా రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి అంటే  దాదాపు మూడేళ్ల పదవీ కాలాన్ని ఉత్తర్ ప్రదేశ్ కోల్పోవాల్సి వస్తుంది.  2019 తరువాత 2024లో తిరిగి లోక్ సభకు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు యూపీ ఎన్నికలను వాయిదా వేయాలంటే అక్కడి ప్రభుత్వం పదవీ కాలం ముగిసి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఇటువంటి అడ్డంకులను ఏ విధంగా ఎదుర్కుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jersey for cheap cheap Eagles jerseys