బిల్ గేట్స్ పిల్లలయినా….

వారు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడి బిడ్డలు … ఈ  మాట చెప్పగానే వాళ్లు కోరుకున్న వస్తువులు క్షణాల్లో ఒల్లో వాలిపోతాయని వారి నోటి వెంట నుండి మాట రాకముందే వారు కోరుకుంది జరుగుతుందని సాధారణంగా అనుకుంటాం… కానీ బిల్ గేట్స్ పిల్లలు మాత్రం తమకు స్మార్ట్ ఫోన్లు కావాలంటూ చాలా కాలం అడిగినా వారికి చేతికి ఫోన్లు రాలేదట. తమ స్నేహితులు చాలా మంది ఫోన్లు వాడుతున్నారని తమకూ కావాలంటూ వారు ఎంత బతిమిలాడినా గేట్స్ వారి చేతికి ఫోన్లను  ఇవ్వలేదట.  ఈ  విషయాన్ని స్వయంగా బిల్ గేట్స్ చెప్పారు. తన పిల్లలకి 14 సంవత్సరాలు వచ్చేవరకు వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వలేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన పిల్లలు తనతో ఎంతగా గొడవపడినా తాను మాత్రం వారికి ఫోన్లను కొనివ్వలేదంటూ చెప్పుకొచ్చారు. తన ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి జెన్నిఫర్‌, రోరీ, ఫీబీ ల విషయంలో తాను చేసింది సరైందేనని భావిస్తున్నట్టు గేట్స్  అన్నారు.

భోజనం చేసే సమయంలో తమ ఇంట్లో ఎవరూ ఫోన్లు వాడరని బిల్ గేట్స్ తెలిపారు. డిన్నర్ టేబుల్ వద్దకు ఫోన్లను తేవడం నిషేధమన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా వచ్చే నీలి కిరణాల వల్ల పిల్లల నిద్ర పాడవుతుందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *