మోడీ,కేసీఆర్ తోడు దొంగలు:దిగ్గీ

     ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒక రహస్య అవగాహనకు వచ్చారని కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఇద్దరు నేతలు చికటి ఒప్పందం కుదుర్చుకుని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ముస్లీం రిజర్వేషన్ల అంశంపై ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్దిని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన చర్య వల్ల ఎస్టీలు తీవ్రంగా నష్టపోతున్నారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ముస్లీం రిజర్వేషన్ల పేరుతో టీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.

తమ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని దిగ్విజయ్ తేల్చి చెప్పారు. అయితే రిజర్వేషన్ల పేరుతో టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాన్ని ఎండగట్టాడానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుత విధానంలో రిజర్వేషన్లను ప్రకటించడం వల్ల ముస్లీంలు, గిరిజనులకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *