సర్వీస్ ఛార్జీలు తప్పనిసరికాదు

రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీస్ ఛార్జీల పేరిట వినియోగదారుడి నుండి వసూలు చేస్తున్న ఛార్జీలు తప్పనిసరికాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సర్వీసు ఛార్జీలను వినియోగదారుడి విచక్షణకు వదిలేయాలని, వినియోగదారుడికి ఇష్టం ఉంటేనే సర్వీస్ ఛార్జీలు కట్టవచ్చని లేని పక్షంలో సర్వీసు  ఛార్జీని కట్టకుండా వెళ్లిపోవచ్చని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. సర్వీస్ ఛార్జీలను బలవంతంగా వసూలు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. చాలా రెస్టారెంట్లు, హోటళ్లలో వినియోగదారుడి వద్ద నుండి సర్వీసు ఛార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అయితే నిబంధనల ప్రకారం సర్వీసు ఛార్జీలను స్వచ్చంధంగా ఇస్తేనే తీసుకోవాలని పాశ్వాన్ చెప్పారు. సర్వీస్ ఛార్జీలను రెస్టారెంట్లు నిర్ణయించడం సరికాదన్నారు. సర్వీస్‌ఛార్జీలపై నూతన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు.కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు.

సర్వీసు ఛార్జీల విషయంలో గతంలోనూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీస్ ఛార్జీల పేరిట వినియోగదారుడి నెత్తిన కుచ్చుటోపీ పెడుతూనే ఉన్నారు. సర్వర్ కు దక్కాల్సిన ఈ ఛార్జీలను కూడా రెస్టారెంట్ల యాజమాన్యలే తమ ఖాతాలో వేసుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *