విశ్వాస పరీక్షలో నెగ్గిన పారికర్

గోవా అసెంబ్లీలో మనోహర్ పారికర్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. మిత్ర పక్షాల మద్దతుతో పారికర్ విశ్వస పరీక్షలో సులభంగా నెగ్గారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు రాగా బీజేపీకి 13 స్థానాలు లభించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 21 స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో బీజేపీ మిత్రపక్షాల సాహాయంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. 22-16 తేడాతో పారికర్ విశ్వస పరీక్షలో సులభంగా నెగ్గారు. పారికర్ ప్రభుత్వానికి అనూకంలాగ 22 ఓట్లు రాగా వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *