kcr
Featured
DSC01012
telangana talli
telangana state
Celebration
Telangana March

TG Special

ప్రపంచ చరిత్రలో తెలంగాణ పోరాటానికి చోటు…

Posted on 02 June 2014

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలు సుదీర్ఘంగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. చరిత్రలో ఇంత సుదీర్ఘంగా సాగిన పోరాటం మరొకటి లేదనే చెప్పవచ్చు. అస్థిత్వం కోసం.. సంస్కృతి కోసం..హక్కుల కోసం తెలంగాణ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పటు సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం జరిగింది. ఈ క్రమంలో ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయి. పెద్ద మనుషులు ఒప్పందాలను తుంగలో తొక్కారు. తెలంగాణ నీళ్లు, నిధులు దోచుకోవడం మొదయింది. దీనితో 1969లో [...] Continue Reading

Comments (0)

TRS Flag

TG Special

ఆధికారంలో వచ్చిన ఉధ్యమ పార్టీ

Posted on 02 June 2014

పదమూడేళ్ల కిందట రాష్ట్ర రాజకీయ వనంలో విరిసిన గులాబీ నేటికీ వసివాడకుండా… పస తగ్గకుండా తన ఉద్యమ పరిమళాల్ని వెదజల్లుతూనే ఉంది. తెలంగాణ వాదమే జీవనాడిగా ఊపిరిపోసుకుని… రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేస్తూ.. దశాబ్దానికి పైగా ఉద్యమానికి ఊపిరిలూదుతూ… ఒక్క రక్తపు బొట్టు చిందకుండా… తన విజయ తీరాన్ని చేరింది. తెలంగాణ ప్రజల కలను ఇలలో సాకారం చేసింది. పధ్నాలుగేళ్ల కిందట రాష్ట్ర రాజకీయాల్లో ఓ నవ యువ సంచలనం ఊపిరి పోసుకుంది. అదే టీఆర్‌ఎస్‌. అప్పటి [...] Continue Reading

Comments (0)

KCR

TG Special

తెలంగాణ జాతిపిత కేసీఆర్

Posted on 02 June 2014

రాష్ట్రావిర్భావంతో కేసీఆర్‌ తెలంగాణ జాతిపితగా ఆవిర్భవించారు. ఇప్పుడు ఆయన హీరో. ఇన్నేళ్ల పాటు తెలంగాణ కల సాకారమయ్యేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడారు. ఇప్పుడు కాంగ్రెస్‌ రాజకీయాలను కూడా కాదని, తెలంగాణ కోసం అడుగులేశారు. విలీనానికి ఆహ్వానాలు పలికిన కాంగ్రెస్‌కి తిరస్కార సందేశం పంపి.. ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇన్నాళ్లూ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్‌… ఇకపై నవ తెలంగాణాను నడిపించనున్నారు. ఇన్నాళ్లూ ఉద్యమ సారధిగా ఉన్న వ్యక్తి.. తెలంగాణ శక్తిగా ఆవిర్భవించారు. [...] Continue Reading

Comments (0)

telangana

TG Special

స్వేచ్ఛాగీతం పాటుకుంటున్న తెలంగాణ

Posted on 02 June 2014

బంగారు తెలంగాణ అవతరించింది. ఆరున్నర దశాబ్దాల ప్రజల కల సాకారమైన వేళ.. తెలంగాణ ప్రజల జీవితాల్లో కోటి కాంతులు వెలిగిన వేళ… భారత 29వ రాష్ట్రంగా తెలంగాణ తన కొత్త ప్రస్థానం మొదలు పెట్టింది.ఆరున్నర దశాబ్దాల కల సాకారమైంది. భారత 29వ రాష్ట్రంగా సువర్ణ తెలంగాణ ఆవిర్భవించింది. సుదీర్ఘంగా, శరవేగంగా సాగిన విభజన ప్రక్రియ తర్వాత దేశాధ్యక్షుని ఆదేశాల మేరకు జూన్ 2 తెలంగాణ కలసాకారం చేసుకుంది. నా తెలంగాణ, కోటి రతనాల వీణ అన్న దాశరధి [...] Continue Reading

Comments (0)

telangana stupam

TG Special

జోహార్ అమరవీరులకు…జోహార్

Posted on 02 June 2014

దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడింది. అధికారికంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిన శుభతరుణం ఇది.  ఈ కల సాకారం వెనుక ఎందరెందరివో త్యాగాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో పేగు బంధాన్ని, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో రక్త సంబంధాన్ని, కట్టుకున్నవారితో అనుబంధాన్ని, స్నేహబంధాలను తెంచుకుని వెళ్లిపోయిన వారెం దరో… నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఆత్మహత్యల కు పాల్పడ్డారు. కొందరు ఉరితాడును [...] Continue Reading

Comments (0)

telangana state

TG Special

తెలుగుల మాగాణం.. తెలంగాణం

Posted on 02 June 2014

రెండువేల ఏళ్లకు పూర్వం భారత దేశానికి ఒక సమున్నత జీవన విధానాన్ని అందించిన జాతి తెలంగాణా. తెలుగు వారందరినీ ఏకం చేసి దక్షిణాపథాన విలక్షణ సామ్రాజ్య వ్యవస్థను నెలకొల్పిన భూమి తెలంగాణా. అచ్చమైన తెలుగు అస్తిత్వాన్ని నిలుపుకొని, నిలబెట్టిన ప్రాంతం తెలంగాణా.. తెలుగు మాట్లాడే వారికి మాగాణి.. తెలుగుల మాగాణం.. తెలంగాణం. ఈ మట్టి వాసనలోనే ఒక అనిర్వచనీయమైన మాధుర్యం ఉంది.. వేదాలకు చక్కని భాష్యం చెప్పిన గొప్ప పండితులను కన్న నేల ఇది. తత్త్వశాస్త్రాన్ని మధించి, [...] Continue Reading

Comments (0)

SEE MORE ARTICLES IN THE ARCHIVE

SocialTwist Tell-a-Friend
Abacus Training Advertise Here Printing & Outdoor Agency
Glory Tours & Travels Advertise Here Abacus Training